అట్టుడుకుతున్న తెలంగాణ జిల్లాలు
తెలంగాణ పొలిటికల్ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ సందర్భంగా తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యమకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో పోలీసులు భారీ ఎత్తున అరెస్టులకు తెరదీశారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2,500 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయగా, 260 మందిని అరెస్టు చేశారు. ఇక హైదరాబాద్ మెడిసిటి ఆసుపత్రి వద్ద 20 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నగరంలో రవాణా వ్యవస్థ తాత్కాలికంగా మందగించింది. అధికారులు నగరం నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్ళే పాసింజర్ రైలు సర్వీసులను రద్దు చేయగా, బస్సులను సమస్యాత్మక మార్గాల్లో కాకుండా వేరే రూట్లలో తిప్పుతున్నారు. ఇక ఎంఎంటీఎస్ రైళ్ళను నిలిపివేశారు.